మాన్‌సూన్ ఎఫెక్ట్… ఇది భారీ వర్షాల సీజన్!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్‌, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర మీదుగా ఒడిశా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. ఆగస్టు 4న బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి […]

మాన్‌సూన్ ఎఫెక్ట్... ఇది భారీ వర్షాల సీజన్!
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 5:49 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్‌, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర మీదుగా ఒడిశా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. ఆగస్టు 4న బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 998 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణలో ఈ రోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ రోజు, రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అత్యధికంగా 24 గంటల వ్యవధిలోనే కుమురం భీం జిల్లాలో 266.3, ఎల్కపల్లిలో 206.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుత వానాకాలంలో ఇలా అత్యంత భారీ వర్షాలు పడటం ఇదే తొలిసారి. భారీ వర్షాలకు గోదావరి పరీవాహకంలో చెరువులు జల కళ సంతరించుకుంటున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వెయ్యి చెరువులు అలుగులు పారుతున్నాయి. 18 జిల్లాల పరిధిలో 20,226 చెరువులు ఉన్నాయి. వీటిలో 12902 చెరువుల్లో 25శాతానికి పైగా నీళ్లు చేరాయి. 2738 చెరువులు సగం నిండాయి. మరో 1559 చెరువుల్లోకి 75 శాతం నీరు చేరింది. చెరువుల కింద సాగుకోసం ఇప్పటికే నారుపోసుకున్న రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో చాలా మేరకు చెరువులు నిండాయి.

Latest Articles
ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..
వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..
చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..
చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.
కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.
ఈ డ్రింక్‌ రోజుకు 2 సార్లు తాగితే.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగి..
ఈ డ్రింక్‌ రోజుకు 2 సార్లు తాగితే.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగి..
ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలుః సీఎం జగన్
ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలుః సీఎం జగన్
ఇది అందం కాదు.. అద్భుతం.! దివ్య భారతి వయ్యారానికి యువత ఫిదా..
ఇది అందం కాదు.. అద్భుతం.! దివ్య భారతి వయ్యారానికి యువత ఫిదా..
బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! ఫొటోస్ వైరల్
బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! ఫొటోస్ వైరల్