TV9 Telugu

07 May 2024

సమ్మర్‌లో ఈ పండ్లను కచ్చితంగా తీసుకోవాల్సిందే.. 

సమ్మర్‌లో కచ్చితంగా తీసుకునే పండ్లలో పుచ్చకాయ ప్రధానమైంది. ఇందులో 90 శాతం వాటర్‌ కంటెంట్‌ ఉంటుంది కాబట్టి సమ్మర్‌లో డీహైడ్రేషన్‌ సమస్య దరి చేరకుండా ఉంటుంది. 

ఇక ఎండకాలంలో మాత్రమే లభించే మామిడి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే మామిడిని అతిగా తీసుకుంటే మాత్రం వేడి అయ్యే అవకాశాలు ఉంటాయి.

తర్బూజను కూడా కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో కూడా వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని విటమిన్‌ ఏ రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బొప్పాయిని కూడా సమ్మర్‌లో కచ్చితంగా తీసుకోవాలి. ఇందులో లభించే విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలియేట్, ఫైటోకెమికల్స్ వంటి పోషకాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. 

సమ్మర్‌లో కచ్చితంగా జామ పండ్లను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గుణాలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పైనాపిల్‌ కూడా బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి, ఫైబర్ సమ్మర్‌లో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 

విటమిన్‌ సికి పెట్టింది పేరైనా నారింజను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సమ్మర్‌లో సహజంగా వచ్చే వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.