TV9 Telugu

07 May 2024

మ్యూజిక్‌ వింటే.. గుండె  ఆరోగ్యంగా ఉంటుందా.?

నచ్చిన సంగీతం వింటే మనస్సును ఉత్సాహపరుస్తుంది. మ్యూజిక్‌ వింటే డోపమైన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో డిప్రెషన్, ఒత్తిడి వంటి దూరమవుతాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా మ్యూజిక్‌ కీలక పాత్ర పోషిస్తుంది. మ్యూజిక్‌ వింటున్న సమయంలో రక్తప్రసరణ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

ఒత్తిడిగా ఫీలవుతున్న సమయంలో మంచి సంగీతం వినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఒత్తిడి బలదూర్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు

ఆందోళనతో బాధపడేవారు కూడా సంగీతం వినడాన్ని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ప్రశాంతమైన మ్యూజిక్‌ వినడం వల్ల ఆందోళన తగ్గి, మనసు తేలికపడుతుంది.

అల్జీమర్స్‌, డిమ్మీషియా వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో మ్యూజిక్‌ ఉపయోగపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

మీకు తెలుసా.? మ్యూజిక్‌ వింటే నొప్పులు కూడా తగ్గుతాయని. మ్యూజిక్‌ వినడం ద్వారా విడుదలయ్యే కొన్ని హ్యాపీ హార్మోన్స్‌ శరీరంలో కలిగే నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా మ్యూజిక్‌ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మంచి శ్రావ్యమైన సంగీతాన్ని వింటే చిరాకు పెట్టే ఆలోచనలు దూరమవుతాయని అంటున్నారు

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.