AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రగ్రహాన్ని రష్యన్‌ ప్లానెట్‌గా పేర్కొన్న ఆ దేశ సైంటిస్టు

శుక్రగ్రహం మీద రష్యా కన్నుపడింది.. కన్నేమిటి..? కబ్జాకే దిగబడింది.. శుక్రగ్రహాన్ని రష్యన్‌ ప్లానెట్‌గా పేర్కొంది.. ఆ విధంగా ఆ ప్లానెట్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది.. భూమికి అత్యంత దగ్గరగా ఉండే ఆ గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని బ్రిటన్‌లోని కార్డిఫ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పిన విషయం తెలిసిందే! వారు ఆ అభిప్రాయానికి రావడానికి కారణం శుక్రుడి మీద ఉన్న దట్టమైన మేఘాలలో పాస్ఫైన్‌ అణువులు ఉండటమే! పాస్ఫైన్‌ ఉంది కాబట్టి జీవమూ ఉండే ఛాన్స్‌ ఉందనేది […]

శుక్రగ్రహాన్ని రష్యన్‌ ప్లానెట్‌గా పేర్కొన్న ఆ దేశ సైంటిస్టు
Balu
|

Updated on: Sep 19, 2020 | 5:45 PM

Share

శుక్రగ్రహం మీద రష్యా కన్నుపడింది.. కన్నేమిటి..? కబ్జాకే దిగబడింది.. శుక్రగ్రహాన్ని రష్యన్‌ ప్లానెట్‌గా పేర్కొంది.. ఆ విధంగా ఆ ప్లానెట్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది.. భూమికి అత్యంత దగ్గరగా ఉండే ఆ గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని బ్రిటన్‌లోని కార్డిఫ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పిన విషయం తెలిసిందే! వారు ఆ అభిప్రాయానికి రావడానికి కారణం శుక్రుడి మీద ఉన్న దట్టమైన మేఘాలలో పాస్ఫైన్‌ అణువులు ఉండటమే! పాస్ఫైన్‌ ఉంది కాబట్టి జీవమూ ఉండే ఛాన్స్‌ ఉందనేది కార్డిఫ్‌ యూనివర్సిటీ పరిశోధకుల భావన. శుక్రగ్రహం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం తమదేనంటున్నారు రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌ దొమిత్రి రొగోజిన్‌.. తమ తర్వాత మరెవ్వరూ శుక్రుడి మీద కాలుమోపలేదన్నారు.. మాస్కోలో జరుగుతున్న ఇండస్ట్రీ ఎగ్జిబిషన్‌లో ఆయనీ మాటలన్నారు.. ఆరు, ఏడు, ఎనిమిది దశకాల్లో శుక్రగ్రహంపై తమ సైంటిస్టులు అనేకానేక ప్రయోగాలు చేశారని, ఆ గ్రహానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని తమ స్పెస్‌షిప్స్‌ ఏనాడో సేకరించాయని రొగోజిన్‌ చెప్పారు. త్వరలో మళ్లీ పరిశోధనలు మొదలు పెడతామని, ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామని తెలిపాడు. ఆన్‌ ప్లానెట్‌ స్టేషన్‌ల ద్వారా వీనస్‌ గ్రహ పరిస్థితుల మీద తరచుగా రష్యా ప్రయోగాలు చేసిందని రొగోజిన్‌ అన్నారు. సౌరకుటుంబంలో మొదటిసారి ఇతర గ్రహం మీద అడుగుపెట్టిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు. శుక్రగ్రహం మీది వాతావరణం, మట్టి, ఇతర మూలకాల మిశ్రమం తదితర అంశాల గురించి వివిధ దశల్లో ప్రయోగాలు చేశామని పేర్కొన్నారు. ది సోవియట్‌ వెనెరా-13 అనే స్పేస్‌క్రాఫ్ట్‌ శుక్రుడి మీద అత్యధికంగా రెండు గంటలా ఏడు నిమిషాల పాటు యాక్టివ్‌గా ఉందని, ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉందని తెలిపారు. శుక్రుడిని రష్యా ప్లానెట్‌గా చెప్పుకునే అర్హత తమకు మాత్రమే ఉందన్నారు. చచ్చేంత ఉష్టోగ్రతలతో భగభగమనే ఆ గ్రహంపై జీవం ఉండే ఆస్కారం లేదని చాలామంది చెబుతున్నా.. రష్యా మళ్లీ ఏదో ప్రయోగాలంటోంది.. చూద్దాం ఏం తేలుస్తుందో!