ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్ నియామకం..

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా జి. వాణీమోహన్‌ను నియమిస్తూ జగన్ సర్కార్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఎన్నికల కమిషనర్ కార్యదర్శితో పాటుగా సహకార శాఖ కమిషనర్‌, ఏపీ డెయిరీ అభివృద్ధి సమాఖ్య ఎండీగా, పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపడతారని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా నిమ్మగడ్డ రమేష్ […]

ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్ నియామకం..

Updated on: May 31, 2020 | 2:20 PM

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా జి. వాణీమోహన్‌ను నియమిస్తూ జగన్ సర్కార్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఎన్నికల కమిషనర్ కార్యదర్శితో పాటుగా సహకార శాఖ కమిషనర్‌, ఏపీ డెయిరీ అభివృద్ధి సమాఖ్య ఎండీగా, పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపడతారని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం, బాధ్యతలు స్వీకరించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి.. శ‌నివారం వాటిని వెనక్కి తీసుకున్నారు. ఆయన నియామకం చెల్లదంటూ ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎస్‌ఈసీ కార్యదర్శి పేర్కొన్నారు.