ఏపీ రాజకియాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీ నుంచి వలసల పర్వ కొనసాగుతుంది. అనూహ్యంగా దేవినేని అవినాశ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కొన్ని రోజులుగా పొలిటికల్ జర్నీపై సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తోన్న వల్లభనేని వంశీ నేడు ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో పాటు పలువురు నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు వంశీ. ఇక యంగ్ హీరో ఎన్టీఆర్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశాడు వల్లభనేని వంశీ.
2009 సమయంలో ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి తాను, కొడాలి నాని కలిసి ఒప్పించి తీసుకొచ్చామని తెలిపారు వంశీ. ఎన్నికల ఫలితాల తర్వాత..జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిందంటూ ఓ వార్తా పత్రికతో తప్పుడు ప్రచారం చేయించారని పేర్కొన్నారు. నారా లోకేశ్ పొలిటికల్ భవితవ్యం కోసమే ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వల్లభనేని వంశీ. ఎన్టీఆర్ ముందు ఎవరూ నిలవరని, అతనో ట్రాన్స్‌ఫార్మర్ అని వంశీ అభివర్ణించారు. ఎన్టీఆర్ ఒక చిన్నపిల్లాడని..తన కెరీర్‌ను పణంగా పెట్టి ప్రచారం చేసినా..చంద్రబాబు పక్కన బెట్టారని పేర్కొన్నారు. అందుకే ఆత్మాభిమానం అడ్డొచ్చి ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారని తెలిపారు వంశీ.