నన్నే కరుస్తావా?..పామును కరిచిన వ్యక్తి

వడోదర: ఎవరైనా పాము కరవగానే ఏం చేస్తారు? ఆ విషం శరీరంలోని ఇతర భాగాలకు పాకకుండాా ప్రయత్నాలు చేస్తూ..ముందు ఆస్పత్రికి చేరుకుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ వ్యక్తి విచిత్రమైన చేశాడు. తనను కరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి.. పామును తన నోటిలో పెట్టుకుని కొరుకుతూ దాన్ని తినేయాలని ప్రయత్నించాడు. చివరకు ఆస్పత్రిపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహీసాగర్ జిల్లాలోని అజన్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను కాటేసిన పాముపై ఆగ్రహంతో ఊగిపోయిన పర్వాత్‌ గాలా […]

నన్నే కరుస్తావా?..పామును కరిచిన వ్యక్తి

Updated on: May 05, 2019 | 4:02 PM

వడోదర: ఎవరైనా పాము కరవగానే ఏం చేస్తారు? ఆ విషం శరీరంలోని ఇతర భాగాలకు పాకకుండాా ప్రయత్నాలు చేస్తూ..ముందు ఆస్పత్రికి చేరుకుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ వ్యక్తి విచిత్రమైన చేశాడు. తనను కరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి.. పామును తన నోటిలో పెట్టుకుని కొరుకుతూ దాన్ని తినేయాలని ప్రయత్నించాడు. చివరకు ఆస్పత్రిపాలై ప్రాణాలు కోల్పోయాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహీసాగర్ జిల్లాలోని అజన్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను కాటేసిన పాముపై ఆగ్రహంతో ఊగిపోయిన పర్వాత్‌ గాలా బరియా (70) అనే వ్యక్తి.. తిరిగి పామును పట్టుకుని, కొరికాడు. తెలివి తక్కువగా ఆలోచించి, దాన్ని తినేసే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆయన చేష్టను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.అనంతరం అతడి బంధువులు ఆ పాముని కాల్చేశారు. తన బంధువులు ఈ విషయాన్ని తనకు చెప్పారని దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి వెళ్లానని బరియా కూతురు లీలా మీడియాకు తెలిపారు. బాధితుడిని మొదట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నాలుగు గంటల పాటు చికిత్స పొందిన ఆయన.. అనంతరం మృతి చెందారు.    ‌

Loading...
Unable to load recommendations.
Follow Us