బ్రేకింగ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా , రేపు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

| Edited By: Anil kumar poka

Mar 09, 2021 | 5:07 PM

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి  రాజీనామా లేఖను సమర్పించారు.

బ్రేకింగ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్  రాజీనామా , రేపు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ
Follow us on

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి  రాజీనామా లేఖను సమర్పించారు. ఇక కొత్త సీఎం ను ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం భేటీ కానున్నారు.

60ఏళ్ళ రావత్ రాజీనామా చేయడానికి ఆయన బలహీన నాయకత్వమేనని అంటున్నారు. ఇక ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా  రావత్ మంత్రుల్లో ఒకరైన ధన్ సింగ్ రావత్ పేరు వినవస్తోంది. ఈ ఉహాగానాలకు  ఊతమిస్తున్నట్టుగా గర్వాల్ లో ఉన్న ఆయన హుటాహుటిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ లో డెహ్రాడూన్ చేరుకున్నారు. అంతకు ముందు త్రివేంద్ర సింగ్ రావత్ ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా  పలువురు బీజేపీ నేతలను కలుసుకున్నారు. ఈయన పనితీరు చాలా బలహీనంగా ఉందని ఈయన మంత్రుల్లో కొందరు,  కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ఎన్నికలు జరుగనున్నాయి. అంతవరకు ఈయనను కొనసాగిస్తే పార్టీకి విజయావకాశాలు ఏ  మాత్రం ఉండవని వీరు పేర్కొన్నట్టు సమాచారం. పైగా ఆయన రాజీనామాను పార్టీ హైకమాండ్  తిరస్కరించిన పక్షంలో తాము రాజీనామా చేస్తామని వారు హెచ్ఛరించినట్టు తెలిసింది.

బీజేపీ కేంద్ర పరిశీలకులైన రమణ్ సింగ్,  దుశ్యంత్ సింగ్ గౌతమ్..డెహ్రాడూన్ సందర్శించి అక్కడి రాజకీయ పరిణామాలను ఆకళింపు చేసుకుని ఓ నివేదికను బీజేపీ అగ్రనాయకత్వానికి అందజేశారు. డ్యామేజీ కంట్రోల్ జరగాలంటే నాయకత్వ మార్పు అనివార్యమని  వీరు తమ నివేదికలో పేర్కొన్నారు.నిజానికి నిన్నటి నుంచే త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయవచ్చునని వార్తలు వచ్చాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :

Hyderabad : తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై కారులో మంటలు వీడియో