Fast Bowler Sudeep Tyagi: టీమిండియా మాజీ పేసర్ సుదీప్ త్యాగి 13 ఏళ్ల సుదీర్ఘమైన క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. 2009లో భారత్ తరపున బరిలోకి దిగిన త్యాగి.. 4 వన్డేలు ఆడి మూడు వికెట్లు తీశాడు. అలాగే శ్రీలంకపై ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అటు డొమెస్టిక్ క్రికెట్‌లో ఓవరాల్‌గా 156 వికెట్లు సాధించాడు. ఇకపై ఐపీఎల్‌లో సుదీప్ త్యాగి 2009, 2010 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
‘ భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే నా కల నెరవేరింది. నా రోల్ మోడల్స్ మహమ్మద్ కైఫ్, ఆర్పి సింగ్, సురేష్ రైనాలకు.. అలాగే నా తొలి వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనికి ధన్యవాదాలు. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. అయినా తప్పదు ముందుకు సాగిపోవాలి’ అని త్యాగి పేర్కొన్నాడు. కాగా, దేశవాళీ క్రికెట్‌లో సుదీప్ త్యాగి తన చివరి మ్యాచ్‌ను 2017లో ఆడాడు.
Also Read:
‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..
Flash News: ఫిబ్రవరిలో ఏపీ పంచాయితీ ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక ప్రకటన..?
కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!