అమెరికాలోని టెనెసీలో ఓ ఆసుపత్రిలో ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్సు హఠాత్తుగా స్ప్రహ కోల్పోయింది. నిజానికి వలంటీర్లకు ఈ టీకామందు ఇచ్ఛే ప్రయత్నంలో ఉంది ఈమె. ఈ సందర్భంగా టిఫనీ డోవర్ అనే ఈ నర్సు చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టింది. వీళ్లంతా (వలంటీర్లు ) తన స్టాఫ్ అని, ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎగ్జయింటింగ్ గా ఉన్నారని, మనం కోవిడ్ యూనిట్ లో ఉన్నామని పేర్కొంది. మొదట మా స్టాఫ్ తొలి వ్యాక్సిన్ తీసుకుంటుంది అని మాట్లాడుతూనే తనకు కళ్ళు తిరుగుతున్నాయంటూ స్పృహ కోల్పోయింది. దీంతో అంతా కంగారు పడ్డారు. అయితే కాసేపటికి తేరుకున్న టిఫనీ..తనకు చెయ్యి నొప్పిగా అనిపించినప్పుడు ఇలా మూర్చలా వస్తుందని, చిన్న నాటి నుంచే ఈ రుగ్మత ఉందని తెలిపింది. ఇప్పుడు బాగానే ఉన్నా.. నా చేతి నొప్పి కూడా తగ్గింది అని ఆమె వెల్లడించింది. ఈ నర్సు ఫెయింట్ అయిన వీడియో బాగానే సర్క్యులేట్ అవుతోంది. అయితే ఇది చూసిన చాలామంది… ఫైజర్ టీకామందు తీసుకుంటే మనకూ ఇలాగే అవుతుందేమో అని బెంబేలు పడుతున్నారు.
ఇప్పటికే అమెరికాలో ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థల వ్యాక్సిన్ తీసుకున్న ఓ హెల్త్ వర్కర్ ఆసుపత్రి పాలయ్యాడు. ఇక అలెర్జీ ఉన్నవాళ్లు ఇది తీసుకోకపోవడమే మంచిదని అక్కడి రెగ్యులేటరీ సంస్థలు హెచ్ఛరిస్తున్నాయి.
Today a Tennessee nurse #TiffanyDover passed out on “live” TV after taking the #COVID19Vaccine. Yesterday two healthcare workers who got the vaxx were hospitalized. This is only Week #1. These are the cases that we should be getting alerts about. #brandyvaughan pic.twitter.com/iKVeGaGRi2
— Jeff Lorenzo (@jbellamar) December 18, 2020