అమెరికాలోని కాటన్‌డేల్‌లో మాథ్యూ టేలర్ మిల్లర్ అనే కామాంధుడికి 600 ఏళ్ల జైలు శిక్ష పడింది. చిన్నారులను లైంగికచర్యలకు ప్రేరేపించడమే కాకుండా.. ఆ దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న టేలర్ మిల్లర్‌కు ఈ శిక్ష సరిపోదంటున్నారు అతగాడి చేతిలో బలైపోయినవారు.. మాథ్యూ టేలర్ మిల్లర్ లెక్కకు మించిన లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. అందుకే అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి స్కాట్ కూగ్లర్ అతడికి ఈ శిక్ష విధించారు. తన వికృత చేష్టలతో ఎంతో మంది చిన్నారుల బాల్యాన్ని చిదిమివేసిన రాక్షసుడు ఇతడు.. నాలుగేళ్ల పసిపాపలను కూడా వీడు వదల్లేదు. 2014-2019 మధ్యకాలంలో మిల్లర్ ఎన్నో దారుణాలకు ఒడిగట్టాడని ఎఫ్‌బీఐ తెలిపింది.. లాస్టియర్ అక్టోబర్‌లో మిల్లర్ నేరాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు.. అతడి గదిలో చిన్నారులకు చెందిన 102 అశ్లీల చిత్రాలు దొరికాయి.. పన్నెండేళ్ల వయసున్న ఓ బాలికపై అత్యాచారానికి కూడా ఒడిగట్టాడు ఈ కామాంధుడు.