చైనాపై మళ్ళీ అమెరికా ఫైర్.. దీటైన సమాధానమివ్వాలి…మైక్ పాంపియో .

| Edited By: Pardhasaradhi Peri

Jul 23, 2020 | 3:56 PM

లడాఖ్ తూర్పు ప్రాంతంలో భారత్ పై చైనా కవ్వింత ధోరణిని అమెరికా ఖండించింది. అక్కడ భారత దళాలపై చైనా సేనలు దాడికి దిగడం గర్హనీయమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. ఈ తరుణంలో ఇండియా-అమెరికా వంటి ప్రజాస్వామిక దేశాలు..

చైనాపై మళ్ళీ అమెరికా ఫైర్.. దీటైన సమాధానమివ్వాలి...మైక్ పాంపియో .
Follow us on

లడాఖ్ తూర్పు ప్రాంతంలో భారత్ పై చైనా కవ్వింత ధోరణిని అమెరికా ఖండించింది. అక్కడ భారత దళాలపై చైనా సేనలు దాడికి దిగడం గర్హనీయమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. ఈ తరుణంలో ఇండియా-అమెరికా వంటి ప్రజాస్వామిక దేశాలు కలిసికట్టుగా నడవడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి భారత ప్రభుత్వం సవాలును ఎదుర్కొంటోందని, మన (భారత, అమెరికా) దేశాల ప్రాజెక్టులు, సార్వభౌమాధికారం, మన ప్రజల ఆరోగ్యం, వారి సేఫ్టీ దాదాపు ముప్పును ఎదుర్కొంటున్నాయని పాంపియో అన్నారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్..’ఇండియా ఐడియాస్ సమ్మిట్’ పేరిట నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

టిక్ టాక్ తో బాటు 59 చైనీస్ యాప్ లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంపట్ల ఆయన హర్షం ప్రకటించారు. ఈ యాప్ భారతీయులకు ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. టిక్ టాక్ ని నిషేధించాలని ఇటీవల పాంపియో తమ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వాన్ని పరోక్షంగా కోరారు.