‘ట్రంప్ ! ఇది నాకు ఇరకాటమే’ , మీ ఓటమిని ఒప్పుకోండి’, జో బైడెన్

అమెరికా ఎన్నికల్లోట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం తనకు ఇరకాట పరిస్థితిని సృష్టిస్తోందని ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ అన్నారు.

ట్రంప్ ! ఇది నాకు ఇరకాటమే , మీ ఓటమిని ఒప్పుకోండి,  జో బైడెన్

Edited By:

Updated on: Nov 11, 2020 | 1:41 PM

అమెరికా ఎన్నికల్లోట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం తనకు ఇరకాట పరిస్థితిని సృష్టిస్తోందని ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. ‘దయచేసి మీ ఓటమిని అంగీకరించండి..మీ వైఖరి మీ హుందాతనానికి దోహదపడదు’ అని  ఆయన వ్యాఖ్యానించారు. తను విజయం సాధించానని రిపబ్లికన్లు కూడా ఒప్పుకుంటున్నారని, కావాలనుకుంటే తను కూడా కోర్టుల్లో దావాలు వేస్తానని, కానీ అందుకు తన మనస్సాక్షి అంగీకరించడం లేదని బైడెన్ పేర్కొన్నారు. ‘మిస్టర్ ప్రెసిడెంట్ ! ఐ లుక్ ఫర్వర్డ్ టు స్పీకింగ్ విత్ యూ’ అని జాలిగొలిపే విధంగా ఆయన మాట్లాడారు. నిజం చెప్పాలంటే ట్రంప్ వైఖరితో తను అయోమయ పరిస్థితిలో ఉన్నానని, ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కానున్నారని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలను ఆయన అపహాస్యం చేశారు. ఇప్పటివరకు అలాంటి దాఖలాలులేవన్నారు. అసలు మేము గెలిచామన్న విషయాన్ని మీరెందుకు ఒప్పుకోవడంలేదు ? కానీ  మీ వ్యాఖ్యలను మేం పట్టించుకోవడంలేదు’ అన్నారు. తానేమీ నిరాశావాదిని కానని, తన గెలుపు గురించి చాలామంది రిపబ్లికన్లు సైతం ప్రస్తావించారని బైడెన్ పేర్కొన్నారు.

అటు-ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కూడా ట్రంప్ మొండితనాన్ని ప్రశ్నిస్తూ ప్రసంగించారు.