AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాను పరోక్షంగా దెబ్బ కొట్టిన అమెరికా, టిబెట్ వ్యవహారాల్లో జోక్యం, దలైలామా వారసుని ఎంపికపై బిల్లుకు సెనేట్ ఆమోదం

తమ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎన్నుకోవడానికి టిబెటన్లకు గల హక్కును అమెరికా అంగీకరించింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును యూఎస్ సెనేట్ ఆమోదించింది. ఇది చరిత్రాత్మకమని..

చైనాను పరోక్షంగా దెబ్బ కొట్టిన అమెరికా, టిబెట్ వ్యవహారాల్లో జోక్యం, దలైలామా వారసుని ఎంపికపై బిల్లుకు సెనేట్ ఆమోదం
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 22, 2020 | 4:38 PM

Share

తమ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎన్నుకోవడానికి టిబెటన్లకు గల హక్కును అమెరికా అంగీకరించింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును యూఎస్ సెనేట్ ఆమోదించింది. ఇది చరిత్రాత్మకమని, చైనాకు క్లియర్ మెసేజ్ అని ధర్మశాల పేర్కొంది. ‘టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ 2020 పపేరిట ఈ బిల్లుకు సెనేట్ ఆమోదముద్ర వేసింది. టిబెట్ లోని లాసాలో యూఎస్ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లులో నిర్దేశించారు. దలైలామా వారసుడి ఎంపికపై టిబెట్ లో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టిబెట్ పై ఆధిపత్యం తమదేనని చైనా ప్రకటించుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఈ బిల్లును ఆమోదించడం విశేషం. దలైలామా వారసుడి ఎంపికలో చైనా ఎలాంటి జోక్యం చేసుకున్నా తాము సహించబోమని, చైనాపై తీవ్ర ఆంక్షలు విధించే యోచన చేస్తామని అమెరికా హెచ్చరించింది. ప్రతినిధుల సభ ఈ బిల్లును ఇదివరకే ఆమోదించింది.

అయితే చైనా దీనిపై ఆగ్రహం ప్రకటిస్తూ ఈ బిల్లుపై సంతకం చేయరాదని డోనాల్డ్ ట్రంప్ ను కోరింది. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని కోరింది. 14 వ దలైలామా ఎంపికపై ఆ దేశం ఇదివరకే దృష్టి పెట్టింది.

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..