పాకిస్తానీ గర్ల్ మలాలా యూసుఫ్ జాయ్ కి ‘స్కాలర్ షిప్ యాక్ట్’ బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం

| Edited By: Anil kumar poka

Jan 04, 2021 | 11:06 AM

పాకిస్థానీ గర్ల్ మలాలా యూసఫ్ జాయ్ విద్యకు సంబంధించి స్కాలర్ షిప్ లభించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.

పాకిస్తానీ గర్ల్ మలాలా యూసుఫ్ జాయ్ కి స్కాలర్ షిప్ యాక్ట్ బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం
Follow us on

పాకిస్థానీ గర్ల్ మలాలా యూసఫ్ జాయ్ విద్యకు సంబంధించి స్కాలర్ షిప్ లభించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. గత మార్చిలో ఈ బిల్లుకు ప్రతినిధుల సభ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సెనేట్ ఈ నెల 1 న మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. ఇక ఇది అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం కోసం వైట్ హౌస్ చేరాల్సి ఉంది. పాక్ యువతులకు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కింద 2020 నుంచి 2022 వరకు కనీసం 50 శాతం స్కాలర్ షిప్స్  ఇచ్చేందుకు యూఎస్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్  డెవలప్ మెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. 2014 అక్టోబరు 10 న మలాలాకు, భారత బాలల హక్కుల యాక్టివిస్ట్ కైలాష్ సత్యార్థికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2012 అక్టోబరులో తన కాలేజీకి వెళ్తున్న మలాలాపై తాలిబన్లు కాల్పులు జరిపారు. తమ దేశంలో బాలికలకు విద్య కోసం పోరాడుతున్నందుకు ఆమెపై హత్యాయత్నం చేశారు. ఆ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.  కానీ మలాలా తన లక్ష్యాన్ని వీడలేదు. అంతర్జాతీయంగా తన గళాన్ని వినిపిస్తూనే ఉంది.  పేద బాలికలకు విద్య, అక్షరాస్యత  సౌకర్యాలు లభించాలన్నదే తన ధ్యేయమని చెబుతూ వస్తోంది. ఇందుకు పోరాడుతూనే ఉంది.

మలాలా పోరాటానికి స్పందించిన అమెరికా సైతం ఆమెతో బాటు మరికొంతమందికి స్కాలర్ షిప్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఈ యాక్ట్ తాలూకు బిల్లును తెచ్చింది.