అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్.. ఓటమిని అంగీకరించిన ట్రంప్.. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం..

|

Jan 07, 2021 | 3:17 PM

Joe Biden, Kamala Harris Victory: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ను యూఎస్ ఉమ్మడి సభ ధృవీకరించింది. ఎట్టకేలకు..

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్.. ఓటమిని అంగీకరించిన ట్రంప్.. ఈ నెల 20న ప్రమాణ స్వీకారం..
Follow us on

Joe Biden, Kamala Harris Victory: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ను యూఎస్ ఉమ్మడి సభ ధృవీకరించింది. ఎట్టకేలకు తన ఓటమిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడంతో పాటు అధికార మార్పిడికి పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. దీనితో ఈ నెల 20వ తేదీన బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అటు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఖరారు అయ్యారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 306 ఎలక్ట్రోరల్ ఓట్లు రాగా.. డొనాల్డ్ ట్రంప్‌కు 232  ఎలక్ట్రోరల్ ఓట్లు లభించాయి. అమెరికాను మళ్లీ ఒక్క గొప్ప దేశంగా  ప్రపంచానికి చాటి చూపేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Also Read:

మహిళా ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం..!

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. GHMC కీలక నిర్ణయం.. ఇకపై స్ట్రీట్ ఫుడ్ గల్లీ నుంచి మీ ఇంటికే.!