ఆ ఐటీ కంపెనీలో 10 వేల మందికి అవకాశాలు!

అమెరికాకు చెందిన  మల్టీ నేషనల్‌  ఐటీ కంపెనీ  భారతీయ ఐటీ  నిపుణులకు  శుభవార్త  చెప్పింది.  దేశీయంగా 10వేల మంది ఉద్యోగ  అవకాశాలను కల్పించనున్నామని  అమెరికాకు చెందిన బహుళజాతి ఐటి సేవల సంస్థ డీఎక్స్‌‌సీ టెక్నాలజీస్‌  తాజాగా ప్రకటించింది. ప్రధానంగా డిజిటల్‌ నైపుణ్యం ఉన్న వారికి ఎంపిక  చేస్తామని తెలిపింది. వీరిలో 1500మందిని క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్‌ చేసుకుంటామంది. డిజిటల్ సేవలకై పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన […]

ఆ ఐటీ కంపెనీలో 10 వేల మందికి అవకాశాలు!

అమెరికాకు చెందిన  మల్టీ నేషనల్‌  ఐటీ కంపెనీ  భారతీయ ఐటీ  నిపుణులకు  శుభవార్త  చెప్పింది.  దేశీయంగా 10వేల మంది ఉద్యోగ  అవకాశాలను కల్పించనున్నామని  అమెరికాకు చెందిన బహుళజాతి ఐటి సేవల సంస్థ డీఎక్స్‌‌సీ టెక్నాలజీస్‌  తాజాగా ప్రకటించింది. ప్రధానంగా డిజిటల్‌ నైపుణ్యం ఉన్న వారికి ఎంపిక  చేస్తామని తెలిపింది. వీరిలో 1500మందిని క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్‌ చేసుకుంటామంది.

డిజిటల్ సేవలకై పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన 10వేల మంది టెక్కీలను నియమించుకోవాలని యోచిస్తున్నామని  డీఎక్స్‌సీ టెక్నాలజీస్‌  గ్లోబల్‌ హెడ్‌ శాంసన్‌ డేవిడ్‌ తెలిపారు.  కాగా డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో, యుఎస్‌లో ప్రతిభావంతుల కొరతను ఎంఎన్‌సి ఐటి కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఆఫ్‌షోర్ స్థావరాన్ని భారతదేశానికి తరలిస్తున్నాయి. సీఎస్‌సీ,  హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ విలీనం తరువాత  2017 లో స్థాపించబడిన డీఎక్స్‌సీ ఐటి సంస్థలో భారతదేశంలో దాదాపు 45 వేల మంది పనిచేస్తుండగా, గ్లోబల్‌గా 1.30లక్షల మంది ఉన్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu