స్పేస్ లో అమెరికా ‘సీక్రెట్ మిషన్’… నిఘా ఎవరిపై ?

| Edited By: Pardhasaradhi Peri

May 18, 2020 | 5:06 PM

అమెరికా వైమానిక దళం స్పేస్ లో సీక్రెట్ మిషన్ ని చేపట్టింది. ఇందులో భాగంగా తన ‘అట్లాస్ వీ.రాకెట్’ ని ఈ నెల 17 న కేప్ కెనేవరాల్ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ నెల 16 నే ఈ ప్రయోగం చేపట్టవలసి ఉన్నా.. వాతావరణం బాగు లేకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేశారు. ‘ఆర్బిటల్ టెస్ట్ వెహికల్’ గా కూడా వ్యవహరిస్తున్న ఈ రాకెట్ ఓ శాటిలైట్ ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. రోదసిలో ఈ తరహా […]

స్పేస్ లో అమెరికా సీక్రెట్ మిషన్... నిఘా ఎవరిపై ?
Follow us on

అమెరికా వైమానిక దళం స్పేస్ లో సీక్రెట్ మిషన్ ని చేపట్టింది. ఇందులో భాగంగా తన ‘అట్లాస్ వీ.రాకెట్’ ని ఈ నెల 17 న కేప్ కెనేవరాల్ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ నెల 16 నే ఈ ప్రయోగం చేపట్టవలసి ఉన్నా.. వాతావరణం బాగు లేకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేశారు. ‘ఆర్బిటల్ టెస్ట్ వెహికల్’ గా కూడా వ్యవహరిస్తున్న ఈ రాకెట్ ఓ శాటిలైట్ ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. రోదసిలో ఈ తరహా మిషన్ ని యుఎస్ చేపట్టడం ఇది ఆరవది. ఆశ్చర్యంగా ఈ ‘లాంచ్’ ని కరోనా వైరస్ కి గురైనవారికి, కరోనా రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ‘అంకితమిస్తున్నట్టు’ పేర్కొన్నారు. అట్లాస్ రాకెట్ పేలోడ్ పై ‘ అమెరికా స్ట్రాంగ్’ అనే ఓ మెసేజ్ ని కూడా ‘రాశారు’.

అయితే ఇది మిస్టీరియస్ యుఎస్ స్పేస్ ప్లేన్ అని, చైనాపై గూఢచర్యం నెరపడానికే ఈ ప్రయోగం చేపట్టారని కూడా అంటున్నారు. ఇక ఈ రాకెట్ ని మోసుకు వెళ్తున్న ప్లేన్ ని ‘x -37 B’స్పేస్ ప్లేన్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో చేబట్టిన ఇతర మిషన్ల కన్నా ఈ మిషన్ చాలా ప్రయోజనకారి అని యుఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి బార్బరా బారెట్ తెలిపారు. విత్తనాలు, ఇతరాలపై రేడియేషన్ (అణు ధార్మికత) ప్రభావాన్ని టెస్ట్ చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యమన్నారు. బోయింగ్ సంస్థ నిర్మించిన ఈ ప్లేన్.. ఆర్బిట్ లో పవర్ కోసం తన సౌర శక్తి ఫలకాలను వినియోగించుకుంటుంది. ఎవరు.. ఎన్ని చెబుతున్నా ..ఇది కరోనా వైరస్ నేపథ్యంలో చైనా మీద నిఘా లేదా గూఢచర్యం నెరపడానికేనన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.

Video Courtesy By: WCTV