Uppena Fame Krithi Shetty: మొదటి సినిమా విడుదల కాకుండానే మంచి ఆఫర్స్ అందుకుంటున్న కృతి లక్కీ ఛామ్

సినీ పరిశ్రమలో అవకాశాలు అందుకోవాలంటే అందం, అభినయంతో పాటు లక్ కూడా కలిసిరావాలని అంటారు.. ఆ మాటను నిజం చేస్తూ.. ఫస్ట్ మూవీ ఇంకా

Uppena Fame Krithi Shetty: మొదటి సినిమా విడుదల కాకుండానే మంచి ఆఫర్స్ అందుకుంటున్న కృతి లక్కీ ఛామ్

Edited By:

Updated on: Jan 05, 2021 | 5:34 PM

Uppena Fame Krithi Shetty:సినీ పరిశ్రమలో అవకాశాలు అందుకోవాలంటే అందం, అభినయంతో పాటు లక్ కూడా కలిసిరావాలని అంటారు.. ఆ మాటను నిజం చేస్తూ.. ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే వరస అవకాశాలను అందుకుంటుందీ సుందరి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అవకాశాన్ని అందుకుంటున్న కృతి శెట్టి నటించిన తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు.. అయితే తాజాగా మూడో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. ఈ సినిమాతోనే తెరంగ్రేటం చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా వైరస్ తో వాయిదా పడింది. అయితే ఈ సినిమా పాటల్లో ప్రోమోలు చాలా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా ప్రోమోల్లో అందం, అభినయం.. హావభావాలతో కృతి ఆకట్టుకుంది.

కృతి చాలా మంచి అమ్మాయి.. మూవీ షూటింగ్ సమయంలో ఇబ్బంది పెట్టకుండా అందరికీ సహకరిస్తుందని చిత్ర యూనిట్ టాక్. దీంతో ఈ చిన్నదానికి వరస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌లో ఓ క‌థానాయిక‌గా కృతి ఎంపికైంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో కృతి అవ‌కాశం ద‌క్కించుకుంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ లాంటి అభిరుచి ఉన్న ద‌ర్శకుడి సినిమాలో అవకాశం అందుకుంది. ఇంద్రగంటి సినిమాల్లో క‌థానాయిక‌ల‌కు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో, ఆయ‌న హీరోయిన్లను ఎంత బాగా చూపిస్తారో తెలిసిందే కాబ‌ట్టి కృతి మ‌రో బంప‌రాఫ‌ర్ కొట్టేసిన‌ట్లేనని ఫిల్మ్ నగర్ లో టాక్. మరి మొదటి సినిమా విడుదల కాకుండానే మంచి ఆఫర్స్ అందుకుంటున్న కృతి లక్కీ ఛామ్ అంటున్నారు.

Also Read: రామ్‌ చరణ్‌కి పెద్ద అభిమానిని.. ఆయన సినిమాలన్నీ చూశా.. ‘ఉప్పెన’ బ్యూటీ