Upendra ‘Kabza’ movie : ఉపేంద్రతోపాటు ‘కబ్జా’ చేయడానికి సిద్దమైన మరో స్టార్ హీరో..

|

Jan 13, 2021 | 5:48 PM

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ను రాణిస్తున్నాడు. త్వరలో ఉపేంద్ర కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల...

Upendra Kabza movie : ఉపేంద్రతోపాటు కబ్జా చేయడానికి సిద్దమైన మరో స్టార్ హీరో..
Follow us on

Upendra ‘Kabza’ movie : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ను రాణిస్తున్నాడు. త్వరలో ఉపేంద్ర ‘కబ్జా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను ఏకంగా ఏడూ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఉపేంద్ర సినిమా అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగు మంచి టాక్ ను తెచ్చుకున్నాయి.

ఇక ‘కబ్జా’ సినిమాలో ఉపేంద్ర కాకుండా మరో హీరో కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా ఆ స్టార్ ఎవరనేదాన్ని తెలియజేయనుంది చిత్రయూనిట్. సంక్రాంతి సందర్బంగా గురువారం ఆ విషయాన్ని ప్రకటించబోతున్నట్లుగా పోస్టర్ ను విడుదల చేశారు. ఆ హీరో ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురువారం ఉదయం 10గంటలకు  ఉపేంద్రతోపాటు నటించే ఆ స్టార్ ఎవరన్నది తెలిసిపోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

The Family Man2 Teaser: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ టీజర్ వచ్చేసింది.. లాస్ట్‌లో సామ్ ట్విస్ట్ అదిరింది..

Nagababu Praises Sunitha: మీ ఆనందం, ప్రేమ శాశ్వత చిరునామాగా మారాలంటూ సునీతకు శుభాకాంక్షలు చెప్పిన మెగాబ్రదర్