BJP Election Campaign : గ్రేటర్ పోరు రసవత్తరంగా సాగుతోంది. బీజేపీ బల్దియా ఎన్నికలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి జండా పాతాలని ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. ప్రచారాన్ని అదే స్థాయిలో తీసుకుపోతోంది. గ్రేటర్ లో ప్రచారం కోసం జాతీయ నేతలను దింపుతోంది. ఇందులో భాగంగా ఇక్కడి వచ్చేవారి వివరాలను ప్రకటించారు.
ఈనెల 27న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ హైదరాబాద్‌కు రానున్నారు. పాతబస్తీలో జరిగే బీజేపీ ఎన్నికల ప్రచారంలో యోగీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అలాగే 28న హైదరాబాద్‌కు రానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు రోడ్డు షోలు, మేధావులతో సమావేశాల్లో పాల్గొననున్నారు.
అనంతరం 29న కేంద్ర మంత్రి అమిత్ షా నగరానికి రానున్నారని …పలు ప్రాంతాల్లో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు పది మంది రోడ్ షోలు నిర్వహించేలా బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ భూపేంద్ర యాదవ్ దిశానిర్దేశం చేశారు. ఇక బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో గురువారం విడుదల కానుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.