ఉపాసన పుట్టింట విషాదం..శోకసంద్రంలో కుటుంబం

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉపాసన..

ఉపాసన పుట్టింట విషాదం..శోకసంద్రంలో కుటుంబం

Edited By:

Updated on: May 27, 2020 | 1:16 PM

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు (92) కన్నుమూశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. తెలంగాణలోని దోమకొండలో జన్మించిన ఉపాసన తాత ఉమాపతి రావు ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేశారు. మొట్ట మొదటి టీటీడీ ఈవోగా కూడా పనిచేశారు.

తన తాతయ్య ఉమాపతి రావు ఉర్దూలో మంచి పట్టున్న వ్యక్తి అని, ఉర్దూలో ఆయన అనేక కవితలు రాశారని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఉమాపతి రావు 1928 జూన్ 15న జన్మించారు. ఆయన మృతితో ఉపాసన భావోద్వేగానికి గురైంది. తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా నివాళులు అర్పించింది. మీరందరు కన్నీటి ద్వారా కాకుండా చిరునవ్వుతో ప్రేమని కురిపించాలని కోరింది.

ఉపాసన సన్నిహితులు, మెగా అభిమానులు ఉమాపతి రావు ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో ఉమాపతి రావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ..ఉపాసన ట్విట్‌కు రీట్విట్లు పెడుతున్నారు.

[svt-event date=”27/05/2020,1:00PM” class=”svt-cd-green” ]

Follow Us