వివాహితపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బ్లాక్ మెయిల్..!

32 ఏళ్ల ఓ వివాహితను గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంత్ రావిదాస్ న‌గ‌ర్ జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఓ మ‌హిళ‌పై న‌లుగురు యువ‌కులు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డారు. ఎవరికైనా చెబితే ఆమెతో పాటు భ‌ర్త‌ను కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేపట్టారు. యూపీలోని సంత్ ర‌విదాస్ న‌గ‌ర్ జిల్లాలోని గోపీగంజ్ లో […]

వివాహితపై గ్యాంగ్ రేప్..  వీడియో తీసి బ్లాక్ మెయిల్..!

Updated on: May 30, 2020 | 8:47 PM

32 ఏళ్ల ఓ వివాహితను గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంత్ రావిదాస్ న‌గ‌ర్ జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఓ మ‌హిళ‌పై న‌లుగురు యువ‌కులు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డారు. ఎవరికైనా చెబితే ఆమెతో పాటు భ‌ర్త‌ను కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేపట్టారు.
యూపీలోని సంత్ ర‌విదాస్ న‌గ‌ర్ జిల్లాలోని గోపీగంజ్ లో మే 10న క‌ట్టెపుల్ల‌ల కోసం ఊరి చివ‌రికి వెళ్లిన ఆ వివాహితపై సోనూ బింద్, దీప‌క్ సింగ్, అచే లాల్, మాధ‌వ్ యాద‌వ్ అనే న‌లుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ ఫోన్ లో వీడియో తీసి.. ఎవ‌రికైనా చెబితే ఆ మ‌హిళ‌ను, ఆమె భ‌ర్త‌ను హ‌త్య చేస్తామంటూ బెదిరించి పారిపోయారు. ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్పుకోలేక కుమిలిపోయిన ఆమె కొద్ది రోజుల త‌ర్వాత భ‌ర్తకు విషయం చెప్పింది. దీంతో గోపీగంజ్ స్టేష‌న్ లో జరిగిన ఘటనపై ఆ మ‌హిళ ఫిర్యాదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప‌రారీలో ఉన్న నిందితులు గాలింపు చేప‌డుతున్నామ‌న్నారు.