కేదార్ నాథ్ ని ముంచెత్తిన మంచు, చిక్కుకుపోయిన ఉత్తరాఖండ్, యూపీ ముఖ్యమంత్రులు, చివరకు సేఫ్ రిటర్న్

| Edited By: Pardhasaradhi Peri

Nov 16, 2020 | 7:51 PM

కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం చాలాసేపు..

కేదార్ నాథ్ ని ముంచెత్తిన మంచు, చిక్కుకుపోయిన ఉత్తరాఖండ్, యూపీ ముఖ్యమంత్రులు, చివరకు సేఫ్ రిటర్న్
Follow us on

కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం చాలాసేపు అక్కడే చిక్కుకుపోయారు. విపరీతమైన మంచు కురుస్తుండడంతో ఎటూ కదలలేకపోయారు. వాతావరణం బాగులేకపోవడంతో ఈ  ముఖ్యమంత్రులు సమయానికి తమ రాజధానులను చేరలేకపోయారని ఉత్తరాఖంఢ్ డీజీ తెలిపారు. అయితే చివరకు సాయంత్రం అయిదున్నర గంటల ప్రాంతంలో వీరు సురక్షితంగా గౌచార్ చేరినట్టు తెలిసింది. రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్ నాథ్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను వీరు పర్యవేక్షించారు. అటు=11,12 ఏళ్ళ తరువాత తాను కేదార్ నాథ్ వచ్చానని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఏనాటి నుంచో తనుఇక్కడికి రావాలనుకున్నానని, ఇన్నేళ్లకు ఆ కోర్కె తీరిందని ఆయన చెప్పారు.