ఆ మొబైల్ యాప్స్ ను తొలగించండి.. సిబ్బందికి ఐజీ ఆదేశాలు..

| Edited By:

Jun 20, 2020 | 6:41 PM

గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనాపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. యూపీకి చెందిన ఓ పోలీసు అధికారి. చైనాకు చెందిన వస్తువులుగానీ

ఆ మొబైల్ యాప్స్ ను తొలగించండి.. సిబ్బందికి ఐజీ ఆదేశాలు..
Follow us on

గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనాపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. యూపీకి చెందిన ఓ పోలీసు అధికారి. చైనాకు చెందిన వస్తువులుగానీ, మొబైల్‌ యాప్‌లు గానీ వాడకూడదని తన విభాగం సిబ్బందికి ఏకంగా ఫర్మానా జారీ చేశారు. యూపీలోని  స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అమితాబ్‌ యాష్‌ ఎస్‌ఐబీ లోని సిబ్బందికి చైనా వస్తువులతోపాటు ఆ దేశ మొబైల్‌ యాప్‌లను వినియోగించడం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వివరాల్లోకెళితే.. ఇంటెలిజెన్స్ అధికారులు సూచించిన వీటికి.. జాతీయ భద్రతా కౌన్సిల్ కూడా మద్దతు పలికిందని, ఇవి భారత దేశ భద్రతకు అత్యంత ప్రమాదకారులని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సిఫార్సులపై కేంద్రం చాలా లోతుగా చర్చలు జరుపుతోందని, ప్రతి మొబైల్ యాప్‌తో వచ్చే ప్రమాదాన్ని ఒక్కొక్కటిగా అధికారులు పరిశీలిస్తూనే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. జూమ్ యాప్ ఏమాత్రం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లోనే స్పష్టం చేసిన విషయం విదితమే.

Also Read: కరోనా కట్టడకోసం ‘కఫసుర’.. ఐదు రోజుల్లోనే..