విజయనగరం మన్యంలో వింత వ్యాధి, గిరిజనుల వరుస మరణాలు

|

Nov 19, 2020 | 11:09 AM

విజయనగరం మన్యంలో అంతుచిక్కని వ్యాధి అడవి బిడ్డల ప్రాణాలు తీస్తోంది. శరీర భాగాలు పాడై, కాళ్లు, శరీరంపై వాపులు వచ్చి గిరిజనులు అకస్మాత్తుగా మరణిస్తున్నారు.

విజయనగరం మన్యంలో వింత వ్యాధి, గిరిజనుల వరుస మరణాలు
Follow us on

విజయనగరం మన్యంలో అంతుచిక్కని వ్యాధి అడవి బిడ్డల ప్రాణాలు తీస్తోంది. శరీర భాగాలు పాడై, కాళ్లు, శరీరంపై వాపులు వచ్చి గిరిజనులు అకస్మాత్తుగా మరణిస్తున్నారు. తాజాగా  పాచిపెంట మండలం చిల్లమామిడి గూడేనికి చెందిన పలువురు గిరిజనులు వరుసగా వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. బుధవారం సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి పరిస్థితిని వివరించారు.

గూడేనికి చెందిన ముఖి వెంకటి(55), ముఖి పెద్దమ్మి(45), సింబోయిన సింహాచలం, ముఖి అమ్మన్న, ముఖి అమ్మన్న, ముఖి కోతాయ్య, ముఖి గంగమ్మ,ముఖి కోతాయ్య, ముఖి అప్పలస్వామి, సింబోయిన చిన్నయ్య కొన్నిరోజుల్లోనే వరుసగా మరణించారని తెలిపారు. వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకుని గిరిజనుల ప్రాణాలు పోకుండా కాపాడాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. వ్యాధి లక్షణాల బట్టి మద్యం, మండి కల్లు తాగడం వల్ల వారు చనిపోతున్నారని గురివినాయుడుపేట పీహెచ్‌సీ డాక్టర్ ఎస్‌.రవిశంకర్‌ తెలిపారు. అయితే అది ఏ వ్యాధో నిర్ధారించాల్సి ఉందని, ఉన్నతాధికారులకు మరణాలపై నివేదిక పంపిస్తామన్నారు. కాగా వింత వ్యాధి బారినపడి గిరిజనులు మరణిస్తున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Also Read :

రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు

ప్రకాశం జిల్లాలో పులి పంజా, నాలుగు ఆవులు మృతి !

శ్రీశైల మల్లన్న ప్రసాదం మరింత ప్రియం..మళ్లీ పెరిగిన లడ్డూ ధర