ఇప్పట్నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మందు తాగొచ్చు!

|

Nov 09, 2020 | 5:27 PM

కొన్ని ఇస్లామిక్‌ దేశాలలో మద్యం స్వీకరించడం నేరం.. అలాగే సహజీవనం కూడా నేరమే! అందుకు శిక్షలు అనుభవించి తీరాలి.. అయితే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మాత్రం మద్యం తాగడం చట్టవిరుద్ధమేమీ కాదు.. ఎందుకంటే యూఏఈ పక్కా పర్యాటక కేంద్రం.. అంతే కాదు.. అక్కడ పెద్ద పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు ఉన్నాయి.. పర్యాటకులతో పాటు.. బిజినెస్‌ మీటింగ్‌ల కోసం చాలా మంది అక్కడికి వస్తుంటారు.. అందుకే ఆ దేశం పలు చట్టాలను సరళతరం చేస్తోంది.. ఇప్పుడు అక్కడ లిక్కర్‌ […]

ఇప్పట్నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మందు తాగొచ్చు!
Follow us on

కొన్ని ఇస్లామిక్‌ దేశాలలో మద్యం స్వీకరించడం నేరం.. అలాగే సహజీవనం కూడా నేరమే! అందుకు శిక్షలు అనుభవించి తీరాలి.. అయితే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మాత్రం మద్యం తాగడం చట్టవిరుద్ధమేమీ కాదు.. ఎందుకంటే యూఏఈ పక్కా పర్యాటక కేంద్రం.. అంతే కాదు.. అక్కడ పెద్ద పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు ఉన్నాయి.. పర్యాటకులతో పాటు.. బిజినెస్‌ మీటింగ్‌ల కోసం చాలా మంది అక్కడికి వస్తుంటారు.. అందుకే ఆ దేశం పలు చట్టాలను సరళతరం చేస్తోంది.. ఇప్పుడు అక్కడ లిక్కర్‌ తాగొచ్చు.. అలాగే సహజీవనమూ చేయవచ్చు.. అంటే పెళ్లికానివారు కూడా ఓ చోట నివసించవచ్చన్న మాట! పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కలిగించేందుకే ఈ సంస్కరణలను చేపట్టింది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.. ఇంతకు ముందు అక్కడ మద్యం సేవించినా, లిక్కర్‌ను కలిగివున్నా పెద్ద నేరం. తాజా నిర్ణయంతో నిర్భయంగా మందు తాగవచ్చు. కాకపోతే 21 ఏళ్లు దాటి వుండాలి.. ఇంతకు ముందు అవివాహిత జంట కలిసి ఉండటం నేరం.. ఇప్పుడు కాదు.. ఇక నుంచి పరువు హత్యలను కూడా కఠిన నేరంగా పరిగణిస్తుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..