రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు: కిషన్ రెడ్డి

| Edited By: Pardhasaradhi Peri

Jul 07, 2019 | 4:48 PM

ఏపీ ,తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ భాజపా మాత్రమేనన్నారు. ‘‘తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తా. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తా. పోలవరం నిర్మాణానికి చివరి రూపాయి కూడా కేంద్రమే ఇస్తుంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీకి అధికారం అసాధ్యం అనుకున్న త్రిపుర, అస్సాం, హర్యానా, […]

రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు: కిషన్ రెడ్డి
Follow us on

ఏపీ ,తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ భాజపా మాత్రమేనన్నారు. ‘‘తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తా. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తా. పోలవరం నిర్మాణానికి చివరి రూపాయి కూడా కేంద్రమే ఇస్తుంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీకి అధికారం అసాధ్యం అనుకున్న త్రిపుర, అస్సాం, హర్యానా, మహారాష్ట్ర లో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. ఏపీ ,తెలంగాణలో కూడా బీజేపీ రాబోయే రోజుల్లో సత్తా చాటుబోతుందన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ లో బీజేపీ పుంజుకుంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ లో అధికార పార్టీకి పోటీ ఇవ్వబోయేది బీజేపీయే అన్నారు. కుటుంబ పాలనకు, కుల రాజకీయాలు, మత రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. దేశం మొత్తం గుణాత్మకమైన మార్పు తెస్తా అన్న కేసీఆర్, తన కూతురుని గెలిపించుకోలేకపోయారన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక సీటు కూడా రాదని ప్రచారం చేశారు. కానీ 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలోని పరిస్థితి ఏపీలో కూడా రాబోతుందన్నారు. పోలవరంతో పాటు ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్తం చేశారు.