మహాత్మా గాంధీ స్మారకంగా నాణాన్ని ముద్రించనున్న బ్రిటన్

| Edited By: Pardhasaradhi Peri

Aug 02, 2020 | 12:37 PM

మహాత్మా గాంధీ స్మారకంగా నాణాన్ని   ముద్రించాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తోంది. నల్ల జాతీయులు, ఆసియన్లు, ఇతర మైనారిటీలు తమ దేశాలకు, ప్రజలకు చేసిన సేవలకు  గుర్తింపుగా  ఈ పని చేయాలన్న ఈ ఆలోచనకు..

మహాత్మా గాంధీ స్మారకంగా నాణాన్ని ముద్రించనున్న బ్రిటన్
Follow us on

మహాత్మా గాంధీ స్మారకంగా నాణాన్ని   ముద్రించాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తోంది. నల్ల జాతీయులు, ఆసియన్లు, ఇతర మైనారిటీలు తమ దేశాలకు, ప్రజలకు చేసిన సేవలకు  గుర్తింపుగా  ఈ పని చేయాలన్న ఈ ఆలోచనకు వచ్చింది  అక్కడి ప్రభుత్వం…ఇలాంటి వారిని గుర్తించి వారి స్మృత్యర్ధం నాణాలను ముద్రించాలన్న ప్రతిపాదనను పరిశీలించాలని బ్రిటిష్ ఆర్ధిక మంత్రి రిషి సునక్ …రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీని కోరారు. దీంతో మహాత్మా గాంధీ చిత్రంతో కాయిన్ ను ప్రింట్ చేసే అంశాన్ని ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది.

తన జీవితమంతా శాంతి, అహింసా ప్రబోధాలను గరపిన మహాత్మాగాంధీ..భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. దేశం నుంచి బ్రిటిష్ పాలనకు స్వస్తి చెప్పేలా శాంతియుత ఆందోళనలు నిర్వహించారు.    జాతిపితగా పేరు పొందారు. 1948 జనవరి 30 న కన్నుమూశారు. ఇంకా ఇలాంటి విశిష్ట వ్యక్తుల గురించిన సమాచారాన్ని సేకరించాలని రిషి సునక్..రాయల్ మింట్ అడ్వైజరీకి రాసిన ఓ లేఖలో కోరారు.