ఎన్నో ట్విస్ట్‌ల నడుమ… మహారాష్ట్ర సీఎంగా శివసేనకు చెందిన నేత ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దాదార్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో ఉద్దవ్ థాక్రే 18వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాగా.. ఇప్పటివరకూ థాక్రే కుటుంబంలో ఈ పదవిని మొదటిసారిగా చేపట్టిన వ్యక్తి కూడా ఉద్ధవ్‌నే. అయితే.. ఆయనతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ థాక్రేకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లు లేఖలు రాశారు. సీఎంగా.. ప్రమాణ స్వీకారం చేసిన ఉద్దవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నామని.. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో వారు పేర్కొన్నారు.
ఆరుగురు మంత్రులతో ఉద్ధవ్ ప్రభుత్వం కొలువుదీరింది. కూటమిలోని సభ్య పార్టీలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జయంత్ రాజారాం, ఛగన్ భుజ్‌బల్, బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్ ఉద్ధవ్, ఏక్‌నాథ్ శిందేలు ప్రమాణ స్వీకారం చేశారు.
#Maharashtra: Congress leaders Balasaheb Thorat and Nitin Raut take oath as Ministers. pic.twitter.com/exY9bMoOTN
— ANI (@ANI) November 28, 2019
Mumbai: The oath-taking ceremony of Chief Minister Uddhav Thackeray & others concludes. #Maharashtra pic.twitter.com/ShtgPL1OS7
— ANI (@ANI) November 28, 2019