శ్రీ‌న‌గ‌ర్‌లో ఉగ్రదాడి… ఇద్దరు భారత జవాన్ల మృతి.. కారులో వచ్చి కాల్పులకు దిగిన ఉగ్రమూకలు….

ఉగ్రమూకలు మళ్లీ చెలరేగిపోయాయి. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీ‌న‌గ‌ర్‌ లో కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు.

శ్రీ‌న‌గ‌ర్‌లో ఉగ్రదాడి... ఇద్దరు భారత జవాన్ల మృతి.. కారులో వచ్చి కాల్పులకు దిగిన ఉగ్రమూకలు....
Rajeev Rayala

|

Nov 26, 2020 | 4:25 PM

Two soldiers killed in terror attack in J&K ఉగ్రమూకలు మళ్లీ చెలరేగిపోయాయి. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీ‌న‌గ‌ర్‌ లో కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… శ్రీ‌న‌గ‌ర్‌ హెచ్ఎంటీ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లపై ముగ్గరు ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. కారులో వచ్చిన వారు జవాన్లపై రెప్పపాటులో కాల్పులు జరిపి తప్పించుకున్నారు.

కాగా, వారిలో ఇద్దరు జైషే ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ సభ్యులని, మరొకరు స్థానికుడిగా భావిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలుపుతున్నారు. సాయంత్రం లోగా ఉగ్రమూకలను గుర్తిస్తామని అధికారులు అన్నారు. కాగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే ఈ ఉగ్రదాడి వెనక ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu