ఇద్దరు దుంగ‌ల దొంగ‌లు దొరికారు..విచారణ‌లో కీల‌క విష‌యాలు..

శేషాచలం అడవుల్లో మరోసారి ఎర్ర చంద‌నం స్మగ్లర్లు అల‌జ‌డి రేపారు. టాస్క్ ఫోర్స్ కూంబింగ్ లో ఎదురుపడిన స్మగ్లర్లు..పోలీసులపై రాళ్ళ దాడికి దిగారు.

ఇద్దరు దుంగ‌ల దొంగ‌లు దొరికారు..విచారణ‌లో కీల‌క విష‌యాలు..

Updated on: Jul 24, 2020 | 2:51 PM

శేషాచలం అడవుల్లో మరోసారి ఎర్ర చంద‌నం స్మగ్లర్లు అల‌జ‌డి రేపారు. టాస్క్ ఫోర్స్ కూంబింగ్ లో ఎదురుపడిన స్మగ్లర్లు..పోలీసులపై రాళ్ళ దాడికి దిగారు. పోలీసులు ప్ర‌తిఘ‌టించి..ఇద్ద‌రు త‌మిళ స్మ‌గ్ల‌ర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి 44 ఎర్ర చంద‌నం దుంగ‌లు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డవారిని తమిళనాడు జవ్వాది మలైకు చెందిన ప్రభు (30), సురేష్ (32) లుగా గుర్తించారు. కాగా అరెస్టైన వ్య‌క్తుల్లో ఒక‌రు 2014లో అట‌వీ అధికారిని హ‌త్య కేసులో ముద్దాయిగా పేర్కొన్నారు. వారం రోజులుగా శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు తిష్ట వేసినట్టు స‌మాచారం.

కాగా అట‌వీశాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది టీమ్స్ గా విడిపోయి ఎర్ర‌చంద‌నం స్మ‌గ‌ర్ల కోసం జాయింట్ ఆప‌రేష‌న్ చేస్తున్నారు. ఎర్ర చంద‌నం స‌రిహ‌ద్దులు దాటి త‌ర‌లిపోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కాగా శేషాచలం అడ‌వుల్లో ల‌భించే ఎర్ర చందనానికి ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.