బెంగాల్‌లో కొనసాగుతున్న టెన్షన్.. నాటు బాంబులతో దాడి..

వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లా కంకినారా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. బాంబు దాడిలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని […]

బెంగాల్‌లో కొనసాగుతున్న టెన్షన్.. నాటు బాంబులతో దాడి..

Edited By:

Updated on: Jun 11, 2019 | 3:10 PM

వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లా కంకినారా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. బాంబు దాడిలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా కంకినారలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలప్పటి నుంచి హింసాత్మక వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us