Covid Vaccine: ఇండియాలో తయారైన కోవిడ్ వ్యాక్సిన్ కోసం క్యూలో 25 దేశాలు వేచి ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఇప్పటికే 15 దేశాలకు మన దేశం నుంచి టీకామందులు వెళ్లాయన్నారు. మన దేశం నుంచి వ్యాక్సిన్ తీసుకునే దేశాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించామన్నారు. వీటిలో పేద దేశాలు, భారత ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు వ్యాక్సిన్ కొనుగోలు చేసేవి, అలాగే నేరుగా టీకామందులను ఉత్పత్తి చేసే సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకునే దేశాలని ఆయన వివరించారు. ఏమైనా… ప్రపంచ పటంలో ఇండియా చేసిన కృషి కనిపిస్తోందన్నారు. మనం గ్రాంట్ బేసిస్ మీద కొన్ని పేద దేశాలకు వ్యాక్సిన్ ఇస్తుండగా.. మరి కొన్ని దేశాలు మనం సూచించిన రేట్లకు టీకామందులను కొనుగోలు చేస్తున్నాయని ఆయన వివరించారు. ఇండియాను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా మలచాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని జైశంకర్ పేర్కొన్నారు. మరో 25 దేశాలకు ప్రాధాన్యతా ప్రాతిపదికపై వ్యాక్సిన్లను సరఫరా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా కంపెనీలు కూడా డిమాండ్ కు తగినట్టు వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతున్నాయని అన్నారు.
గత జనవరి 16 నుంచి ప్రారంభించి.. ఇప్పటికే దేశంలో కొన్ని లక్షలమందికి కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఇచ్చారు. మొదటి వర్గంలో హెల్త్ వర్కర్లు, వృధ్దులు ఉన్నారు. రెండో విడతలో ఇతరులకు ఇవ్వనున్నారు. ఓ వైపు ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతుండగా మరోవైపు వ్యాక్సిన్ల వెల్లువ సాగుతోంది. అటు-రష్యన్ వ్యాక్సిన్ పుత్నిక్ వీ అత్యవసర వినియోగం కోసం తాము రెగ్యులేటర్ ని మార్చిలో సంప్రదిస్తామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వెల్లడించింది.
Read More:
ఖమ్మం జిల్లాలో దారుణం.. గ్రామ ఉప సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యయత్నం.. అసలు కారణం అదేనా..?
వారి సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయం.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ