Tv9 Sweet Home Real Estate Expo 2021: ప్రతి మనిషి జీవితంలో సొంతిల్లుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి వ్యక్తీ ఏదో ఒక సమయంలో సొంతింటిని నిర్మించుకోవాలని భావిస్తుంటారు. అయితే సరైన అవగాహన, సమాచారం లేక పోవడంతో ఇళ్లు, స్థలం కొనుగోలు విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికోసమే టీవీ ఒక సువర్ణవకాశాన్ని తీసుకొస్తోంది.
అపర్ణ కన్ట్స్రక్షన్స్, మై హోమ్ గ్రూప్ కన్ట్స్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో టీవీ9 స్వీట్ హోమ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. రేపు (శనివారం) ఉదయం 10 గంటలకి హైటెక్స్‌లోని హాల్ నెం3లో జరగనున్న ఈ ఎక్స్‌పోను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పూర్తిగా కరోనా నిబంధనల నడుమ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. 80 స్టాళ్లలో ఏర్పాటు చేయనున్న ఈ ఎక్స్‌పోకు హైదరాబాద్ నుంచే కాకుండా భారత్‌లోని చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ నుంచి అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పాల్గొననున్నాయి. సొంతిటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి ఒకే వేదికపై బ్యాంకింగ్‌తో పాటు రియల్ ఎస్టేట్‌ని తీసుకురావడానికి టీవీ9 ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటూ.. మీరు కొరుకునే భూమి ధర ఎంత ఉంది, బ్యాంకులు ఎంత వరకు లోన్ ఇస్తాయన్న విషయాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం కావడం మరో విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.
Also Read: మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా మరో కీలక ఒప్పదం.. పూణేకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను అందించేందుకు ఎంవోయూ