AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన చిరునవ్వు కోసం రూ.19 లక్షలతో సర్జరీ.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే నోరెళ్లబెడతారు..

అందంగా కనిపించాలని, ముత్యాల్లాంటి పళ్లతో మెరిసిపోవాలని ఆ మహిళ ఆశపడింది. కానీ, ఆ కోరిక ఆమెను మృత్యువు అంచులకు వరకు తీసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన జాకీ లిన్ అనే మహిళ దంత చికిత్స విషయంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. అందమైన చిరునవ్వు కోసం పళ్ళు చేయించుకోవాలనుకున్న జాకీ లిన్‌ ఆశ ఒక హర్రర్‌ సినిమాను తలపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అందమైన చిరునవ్వు కోసం రూ.19 లక్షలతో సర్జరీ.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే నోరెళ్లబెడతారు..
Dental Surgery Gone Wrong
Jyothi Gadda
|

Updated on: May 01, 2026 | 5:40 PM

Share

అందంగా కనిపించాలనే కోరిక కొన్నిసార్లు ఆ వ్యక్తిని తిరిగి రాని స్థితికి తీసుకువెళుతుంది. బ్రిటన్‌కు చెందిన 38 ఏళ్ల జాకీ లిన్‌కు కూడా ఇలాంటిదే జరిగింది. హార్మోన్ల సమస్యల కారణంగా ఆమె దంతాలు ఊడిపోయాయి. వాటిని సరిచేయించుకోవడానికి ఆమె టర్కీకి వెళ్ళింది. తాను అద్భుతమైన చిరునవ్వుతో తిరిగి వస్తానని ఆమె భావించింది. కానీ, విధి ఆమె కోసం వేరే ప్రణాళికను సిద్ధం చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో టర్కీ టీత్ (Turkey Teeth) అనే ట్రెండ్ నడుస్తోంది. టర్కీ దేశంలో తక్కువ ధరకే దంతాల ఆకృతిని మార్చే సర్జరీలు చేస్తారని నమ్మి చాలామంది అక్కడికి వెళ్తుంటారు. జాకీ లిన్ కూడా అదే విధంగా టర్కీకి వెళ్లి సుమారు రూ. 19 లక్షలు (18,000 పౌండ్లు) ఖర్చు చేసి వెనీర్స్, ఇంప్లాంట్స్ చేయించుకుంది. అందమైన చిరునవ్వు కోసం పళ్ళు చేయించుకోవాలనుకున్న ఒక మహిళ ఆశ, ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. మొదట్లో అంతా బాగున్నట్లు అనిపించినా, కొద్దిరోజులకే అసలు సమస్య మొదలైంది.

Dental Surgery Gone Wrong

ఇవి కూడా చదవండి

సర్జరీ జరిగిన కొన్ని వారాలకే ఆమె పళ్లు ఒక్కొక్కటిగా ఊడిపోవడం ప్రారంభమయ్యాయి. దానికి తోడు నోటిలో, ముఖంపై భయంకరమైన ఇన్ఫెక్షన్ సోకింది. గమ్ ఇన్ఫెక్షన్ (చిగుళ్ల వ్యాధి) తీవ్రమవ్వడంతో ఆమె ముఖం వాచిపోయింది. ఇన్ఫెక్షన్ క్రమంగా దవడ ఎముకలకు పాకడంతో వైద్యులు ఆమెకు ప్రాణాపాయం ఉందని హెచ్చరించారు. ఆ నొప్పితో ఆమె కనీసం ఆహారం తీసుకోలేక, మాట్లాడలేక ఆమె నరకయాతన అనుభవించింది. బ్రిటన్ తిరిగి వచ్చిన తర్వాత ఆమెను పరీక్షించిన స్థానిక వైద్యులు, ఆమె పరిస్థితి చూసి షాక్‌కు గురయ్యారు.

సర్జరీ సరిగ్గా జరగకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకిందని తేల్చారు. చివరకు ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె తన నోటిలోని పళ్లన్నింటినీ తొలగించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె పళ్లు లేని స్థితిలో దంతాల అమరిక (Dentures) పై ఆధారపడాల్సి వస్తోంది. కేవలం అందం కోసం విదేశాల్లో తక్కువ ధరకు దొరికే వైద్యంపై మొగ్గు చూపడం వల్ల కలిగే ప్రమాదాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ, తన సహజమైన దంతాలను శాశ్వతంగా కోల్పోయింది.

ఈ భయంకరమైన అనుభవం తర్వాత జాకీ లిన్ సోషల్ మీడియా వేదికగా ఇతరులను హెచ్చరిస్తోంది. కేవలం తక్కువ ధరలో వస్తుందని లేదా అందంగా కనిపిస్తామని విదేశాల్లో ఇలాంటి రిస్కీ సర్జరీలు చేయించుకోవద్దు. అది మీ ప్రాణాలకే ముప్పు కావచ్చు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వైద్య నిపుణులు కూడా మెడికల్ టూరిజం పేరుతో జరిగే ఇలాంటి అశాస్త్రీయ చికిత్సల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us