ఏకాంతంగా శ్రీవారికి ‘పవిత్రోత్సవాలు’

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఈనెల 30 నుంచి మూడురోజుల పాటు జరగనున్నాయి. ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్ర‌తిఏడాది శ్రావ‌ణ మాసంలో ఏకాద‌శి, ద్వాద‌శి, త్ర‌యోద‌శి రోజుల్లో ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు. ఇందులో తొలి రోజు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ, తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా […]

ఏకాంతంగా శ్రీవారికి పవిత్రోత్సవాలు

Updated on: Jul 28, 2020 | 6:06 AM

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఈనెల 30 నుంచి మూడురోజుల పాటు జరగనున్నాయి. ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్ర‌తిఏడాది శ్రావ‌ణ మాసంలో ఏకాద‌శి, ద్వాద‌శి, త్ర‌యోద‌శి రోజుల్లో ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు.
ఇందులో తొలి రోజు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది.

ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ, తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కొవిడ్ విజృంభిస్తుండటంతో పవిత్రోత్సవాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. మొదటి రోజున పవిత్రాల ప్రతిష్ట, రెండవరోజు పవిత్ర సమర్పణ, ఆఖరి రోజున పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us