TSRTC: మీ ఇంటికే భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఇవిగో వివరాలు

|

Mar 16, 2023 | 8:56 AM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.

TSRTC: మీ ఇంటికే భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఇవిగో వివరాలు
Bhadrachalam Temple
Follow us on

భద్రాద్రి రామయ్య సీతాదేవిల కళ్యాణాన్ని కనులారా చూడాలని ఎంతోమంది భక్తులు ఆశపడతారు. కాగా నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కళ్యాణంలో ఉపయోగిస్తున్నారు. ఎంతో విశిష్టమైన ఆ కళ్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చుకోవాలని భక్తులు తపిస్తారు. కానీ పలు కారణాల వల్ల కొందరికి ఆ అవకాశం ఉండకపోవచ్చు. అలాంటివారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC). భక్తుల ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలను తీసుకురానుంది. అయితే ఇందుకోసం రూ.116 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సేవలను పొందాలనుకునేవారు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020  సంప్రదించాలని TSRTC ఎండీ సజ్జనార్‌ సూచించారు. తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని తెలిపారు. గతేడాది దాదాపు 89 వేల మందికి తలంబ్రాలను అందించినట్లు తెలిపారు. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చిందని వివరించారు.  శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..