మెట్రో ఎండీగా మరో ఏడాది వరకు ఎన్వీఎస్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జూలై ఒకటో తేదీ నుంచి మరో ఏడాదిపాటు ఆయన ఎండీగా కొనసాగనున్నారు. తనకు మరో ఏడాది కాలాన్ని పొడిగించడంపై ఎన్వీఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్ చేస్తున్న క‌ృషికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ నగరవాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఎన్వీఎస్ […]

మెట్రో ఎండీగా మరో ఏడాది వరకు  ఎన్వీఎస్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ

Updated on: Jun 28, 2019 | 8:08 PM

హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జూలై ఒకటో తేదీ నుంచి మరో ఏడాదిపాటు ఆయన ఎండీగా కొనసాగనున్నారు. తనకు మరో ఏడాది కాలాన్ని పొడిగించడంపై ఎన్వీఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్ చేస్తున్న క‌ృషికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి.

హైదరాబాద్ నగరవాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఎన్వీఎస్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఆయన సారధ్యంలో మెట్రో పట్టాలెక్కింది. ప్రస్తుతం శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us