‘మామగారి పరామర్శ కోసం అల్లుడొచ్చాడు’

| Edited By: Pardhasaradhi Peri

Nov 08, 2020 | 5:16 PM

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చెందడంతో ఆయన అల్లుడు జరేడ్ కుష్నర్ ‘పరామర్శ’ కోసం ఆయన వద్దకు వచ్చారు. ఓటమిని ట్రంప్ అంగీకరించారా లేదా అన్నది తెలుసుకునేందుకు ఆయన ట్రంప్ తో మీట్ అయ్యారు. కుష్నర్ తన మామగారికి సీనియర్ ఆడైజర్ కూడా !  ఎన్నికల ఫలితాలను అంగీకరించాలని ఆయన ట్రంప్ ని కోరినట్టు వార్తా సంస్థలు వెల్లడించాయి. కానీ ‘మామ’ మాత్రం  వెనక్కి తగ్గడంలేదు. అమెరికన్ల ‘నిజాయితీ ఓటు’ కౌంట్ తేలేవరకు తాను విశ్రమించబోనని ఆయన బీష్మించుకుని […]

మామగారి పరామర్శ కోసం అల్లుడొచ్చాడు
Follow us on

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చెందడంతో ఆయన అల్లుడు జరేడ్ కుష్నర్ ‘పరామర్శ’ కోసం ఆయన వద్దకు వచ్చారు. ఓటమిని ట్రంప్ అంగీకరించారా లేదా అన్నది తెలుసుకునేందుకు ఆయన ట్రంప్ తో మీట్ అయ్యారు. కుష్నర్ తన మామగారికి సీనియర్ ఆడైజర్ కూడా !  ఎన్నికల ఫలితాలను అంగీకరించాలని ఆయన ట్రంప్ ని కోరినట్టు వార్తా సంస్థలు వెల్లడించాయి. కానీ ‘మామ’ మాత్రం  వెనక్కి తగ్గడంలేదు. అమెరికన్ల ‘నిజాయితీ ఓటు’ కౌంట్ తేలేవరకు తాను విశ్రమించబోనని ఆయన బీష్మించుకుని కూర్చున్నారు. తను ఓడిపోయానన్న విషయాన్ని ఆయన మనస్సు అంగీకరించడం లేదట. పరాజయాన్ని హుందాగా స్వీకరించవలసిందిగా తను ట్రంప్ ను కోరానని కుష్నర్ తన  సన్నిహితులకు చెప్పారట. ఇలా ఉండగా…. ట్రంప్ ప్రచార సిబ్బంది దాఖలు చేసిన వ్యాజ్యాల తాలూకు లీగల్ యుధ్ధం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. అయితే ఇప్పటికే జో బైడెన్ భావి అధ్యక్షుడని, ఎన్నికల ఫలితాలు ఆయనకు పూర్తి విజయాన్ని తెచ్చిపెట్టాయని అమెరికా అంతటా మారుమోగిపోతుంటే ట్రంప్ చేసే ‘లీగల్ బ్యాటిల్’ ఎంతవరకు ఫలితమిస్తుందో చూడాలి !