Trump Dinner in India: ట్రంప్ కు విందు.. భలే పసందు… పుట్టగొడుగుల వంటకాలు.. దాల్ రైసినా..

|

Feb 25, 2020 | 6:39 PM

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. మంగళవారం రాత్రి డిన్నర్ ఇవ్వనున్నారు. సుమారు వందమంది గెస్టులు ఈ విందుకు హాజరు కానున్నారు.

Trump Dinner in India: ట్రంప్ కు విందు.. భలే పసందు... పుట్టగొడుగుల వంటకాలు.. దాల్ రైసినా..
Follow us on

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. మంగళవారం రాత్రి డిన్నర్ ఇవ్వనున్నారు. సుమారు వందమంది గెస్టులు ఈ విందుకు హాజరు కానున్నారు. బంగారు రేకులతో డెకరేట్ చేసిన ఫ్రెంచ్ డిష్ తో ఈ విందు ప్రారంభమవుతుందట. హిమాలయాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన… పుట్టగొడుగులతో తయారు చేసిన వంటకాలు ఈ మెనులో ప్రధానమైనవి. ఈ పుట్టగొడుగులు కేజీ వెయ్యి రూపాయల నుంచి 30 వేల వరకు ఉంటుందని అంటున్నారు. ల్యాంబ్ బిర్యానీ, ల్యాంబ్ లెగ్ తో వండిన రాన్ ఆలీషాన్, దాల్ రైసినా, దమ్ గుఛ్చి మటర్, హేజిల్ నట్ యాపిల్, వెనీలా ఐస్ క్రీమ్ తదితరాలు ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. అయితే ట్రంప్.. కాయగూరలతో చేసిన వంటకాలను తినడం అరుదుగా చూశామని సన్నిహితులు చెబుతారు. ఆయన శాకాహారి కాకున్నా.. అప్పుడప్పుడు వెజ్ డిష్ లను కూడా తింటారని అంటున్నవారూ ఉన్నారు.