అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనెటర్ కమలా హారిస్ ను తన ప్రత్యర్థి జో బిడెన్ ఎంపిక చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పు పట్టారు. ఈ సెలెక్షన్ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యూఎస్ సెనేట్ లో ఆమెకు మర్యాదే లేదని, ఆమె ‘హారిబుల్’ సభ్యురాలని ఆరోపించారు. డెమొక్రాట్ నామినేషన్ కోసం ఆమె ప్రయత్నిస్తున్న తీరు తనను ఇంప్రెస్ చేయలేదని, ప్రైమరీల్లో ఆమెకు పేలవమైన స్పందన లభించిందని ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. యుఎస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలా హారిస్ ని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా-ఆమె ఎంపిక చరిత్రాత్మకమని, తొలి నల్లజాతి మహిళ, మొట్టమొదటి ఏషియన్ అమెరికన్ వుమన్ కూడా అయిన కమలా హారిస్ ఈ ఎన్నికల్లో విజయం సాధించగలరని ఆశిస్తున్నానని జో బిడెన్ అన్నారు. దేశంలో వర్ణ వివక్ష, జాత్యహంకారం పెట్రేగుతున్న ఈ తరుణంలో ఈమె సెలెక్షన్ మంచి మార్పునకు దారి తీస్తుందన్నారు. అటు-భారతీయ, జమైకా ఇమిగ్రెంట్ దంపతుల కూతురైన కమలా హారిస్ లోగడ శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా వ్యవహరించారు. దివంగతుడై న జోబిడెన్ కుమారునితో గతంలో ఈమె రిలేషన్ షిప్ లో ఉన్నారు. అది కూడా తన నిర్ణయంపై ప్రభావం చూపిందని జో బిడెన్ అంటున్నారు.