పోలీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

| Edited By: Pardhasaradhi Peri

Apr 21, 2020 | 7:44 PM

తెలంగాణ పోలీసు అధికారులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ పేరిట టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా ఇద్దరు అధికారులు ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ వారిని తీరు మార్చుకోవాలని, లేకపోతే తగిన చర్యలు తప్పవని బెదిరించారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. లాక్ డౌన్‌ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాపించకుండా పోలీసులు నిద్రాహారాలు మాని కృషి చేస్తుంటే కొందరు వారిని టార్గెట్ చేస్తూ తమకిష్టం […]

పోలీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
Follow us on

తెలంగాణ పోలీసు అధికారులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ పేరిట టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా ఇద్దరు అధికారులు ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ వారిని తీరు మార్చుకోవాలని, లేకపోతే తగిన చర్యలు తప్పవని బెదిరించారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే.

లాక్ డౌన్‌ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాపించకుండా పోలీసులు నిద్రాహారాలు మాని కృషి చేస్తుంటే కొందరు వారిని టార్గెట్ చేస్తూ తమకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఓ అనుమానాస్పద కుటుంబాన్ని క్వారెంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులను ఎంఐఎం పార్టీకి చెందిన నిజామాబాద్ డిప్యూటీ మేయర్ అడ్డుకోవడమే కాకుండా… దాడులకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇది జరిగి వారం రోజులు గడవక ముందే ఏకంగా అధికార పార్టీకి చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

‘‘ పోలీస్ శాఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా .. లాక్ డౌన్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ రాకేష్ తీరు బాగాలేదు.. లాక్ డౌన్ ఉల్లంగిస్తున్నారని ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. కావాలని కొడుతున్నారు.. ఇది మంచిది కాదు.. ’’ ఇది బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్.. లాక్ డౌన్ అమలుకు కృషి చేస్తున్న పోలీసులనుద్దేశించి చేసిన కామెంట్. ప్రభుత్వం అనుమతించిన సమయంలో బయటకు వచ్చే ఛాన్స్ ఇవ్వాలని లేని పక్షంలో ఆ ఇద్దరు పోలీసు అధికారులపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని బెదిరించారు.

ఓ వైపు ముఖ్యమంత్రి లాక్ డౌన్‌ని కచ్చితంగా అమలు చేయాలని చెబుతూ.. పోలీసులకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తుంటే… ఆయన పార్టీకే చెందిన ఎమ్మెల్యే లాక్‌డౌన్ ఉల్లంఘనలను సమర్థించడం.. తమ వర్గం వారిని టార్గెట్ చేయొద్దని హెచ్చరించడం.. టీఆర్ఎస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ఇందూరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.