జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వైపే పార్టీల మొగ్గు..!

|

Sep 25, 2020 | 1:31 PM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కరోనా ప్రభావం నేపధ్యంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వైపే పార్టీల మొగ్గు..!
Follow us on

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కరోనా ప్రభావం నేపధ్యంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో బల్దియా పాలక మండలి కాలపరిమితి ముగుస్తుండడంతో ఈలోపే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపాలన ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు షురూ చేశారు. జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అలాగే జోన్ల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించారు.

కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టకపోతే బ్యాలెట్​ పేపర్ల ద్వారా ఓటింగ్​ నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోలింగ్ స్టేషన్​లో 800 ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈవీఎంల వినియోగం వల్ల తలెత్తే పరిణామాలపై అధికారులు నిపుణులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే, ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ లెటర్స్​ కూడా పంపింది. ఈ నెల 30 లోపు పార్టీలు తమ సూచనలు తెలపాల్సిందిగా కోరింది. కాగా, అన్ని రాజకీయ పార్టీలు కూడా బ్యాలెట్ వైపే ఇంట్రెస్ట్​ చూపిస్తున్నాయి. ఈవీఎంలతో నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ బ్యాలెట్ పేపర్ ద్వారానే జీహెఎంసీ పోలింగ్ నిర్వహించాలన రాష్ట్ర ఈసీని కోరింది. కొవిడ్ నేపథ్యంలో ఈవీఎంల వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి పేపర్‌ అయితే బెటరని స్పస్టం చేసింది. కాగా, అధికారులు కూడా ఇదే నిర్ణయంతో ఏకీభవిస్తుండటంతో బ్యాలెట్ పేపర్ ద్వారానే పోలింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.