సోషల్ మీడియా అంటే.. బూతు పురాణమేనా..

| Edited By:

Apr 17, 2019 | 4:43 PM

సోషల్ మీడియా వల్ల.. అయితే మంచి.. లేదంటే.. టార్చర్. ఏ విషయాన్నైనా తొందరగా అందరికీ తెలియజేయాలంటే ఇదే మంచి వేదిక. అలాంటి సోషల్ మీడియా.. కొందరి ఆకతాయిల వల్ల అపఖ్యాతిని మూటకట్టుకట్టుకుంటోంది. రెచ్చిపోతున్న ఆకతాయిలు.. సినీ నటులను, రాజకీయ నేతలతో పాటు మహిళలను కూడా టార్గెట్ చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. వాళ్ల లైక్‌లను పెంచుకోవడానికి ఇతరుల లైఫ్‌ను బజారుకీడుస్తున్నారు. ఈ సందర్భంగా.. వైసీపీ నేత లక్ష్మీ పార్వతి, జగన్ సోదరి షర్మిలపై గతంలో కొంత మంది […]

సోషల్ మీడియా అంటే.. బూతు పురాణమేనా..
Follow us on

సోషల్ మీడియా వల్ల.. అయితే మంచి.. లేదంటే.. టార్చర్. ఏ విషయాన్నైనా తొందరగా అందరికీ తెలియజేయాలంటే ఇదే మంచి వేదిక. అలాంటి సోషల్ మీడియా.. కొందరి ఆకతాయిల వల్ల అపఖ్యాతిని మూటకట్టుకట్టుకుంటోంది. రెచ్చిపోతున్న ఆకతాయిలు.. సినీ నటులను, రాజకీయ నేతలతో పాటు మహిళలను కూడా టార్గెట్ చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. వాళ్ల లైక్‌లను పెంచుకోవడానికి ఇతరుల లైఫ్‌ను బజారుకీడుస్తున్నారు.

ఈ సందర్భంగా.. వైసీపీ నేత లక్ష్మీ పార్వతి, జగన్ సోదరి షర్మిలపై గతంలో కొంత మంది అసభ్యకరమైన పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే.. సినీనటి అపూర్వ, మాధవీ లత, హేమలను కూడా వీళ్లు టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.

యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా చేసుకొని సెలబ్రేటీలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కేసులు పెట్టినా.. అరెస్ట్ చేసినా.. సోషల్ మీడియాలో వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఇప్పుడు సినీ నటి పూనమ్ కౌర్.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తనపట్ల అసభ్యంగా వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్నారంటూ.. మండిపడింది పూనమ్. యథాప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.