రేప్ కేసు పెట్టిన మహిళతోనే ఎమ్మెల్యే పెళ్లి

రేప్ కేసు నమోదు చేయడంతో.. దిగొచ్చిన ఎమ్మెల్యే సదరు మహిళను వివాహమాడాడు. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనంజోయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ మే 20వ తేదీన అగర్తల మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కొంత కాలంగా తనతో సన్నిహితంగా ఉన్నారని.. అయితే వివాహమనే సరికి నిరాకరించారని పేర్కొంది. దీంతో పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. […]

రేప్ కేసు పెట్టిన మహిళతోనే ఎమ్మెల్యే పెళ్లి

Updated on: Jun 11, 2019 | 10:03 AM

రేప్ కేసు నమోదు చేయడంతో.. దిగొచ్చిన ఎమ్మెల్యే సదరు మహిళను వివాహమాడాడు. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనంజోయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ మే 20వ తేదీన అగర్తల మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కొంత కాలంగా తనతో సన్నిహితంగా ఉన్నారని.. అయితే వివాహమనే సరికి నిరాకరించారని పేర్కొంది. దీంతో పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ మంజూరుకు దరఖాస్తు చేసుకున్న ధనుంజోయ్ కు నిరాశ ఎదురైంది. దీంతో చేసేదేమి లేక ఆమెను ఆదివారం వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి రెండు కుటుంబాల వారు హాజరయ్యారని లాయర్ ఒకరు మీడియాతో వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us