త్రిపుర సీఎంపై ఫేక్ న్యూస్.. వ్యక్తి అరెస్ట్

| Edited By:

Apr 27, 2019 | 2:09 PM

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి విషయం నిజమని నమ్మలేని పరిస్థితుల్లో ఏకంగా త్రిపుర సీఎం భార్యపైనే వచ్చిన ఓ పోస్టు సంచలనం సృష్టించింది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ తన పట్ల వేధింపులకు పాల్పడుతున్నారని, హింసిస్తుండడంతో విడాకులు తీసుకుంటున్నానని ఆయన భార్య నీతి దేబ్ పేర్కొంటున్నట్టు ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఏకంగా సీఎం కుటుంబానికి సంబంధించిన వార్త కావడంతో కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బిప్లవ్ దేవ్ […]

త్రిపుర సీఎంపై ఫేక్ న్యూస్.. వ్యక్తి అరెస్ట్
Follow us on

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి విషయం నిజమని నమ్మలేని పరిస్థితుల్లో ఏకంగా త్రిపుర సీఎం భార్యపైనే వచ్చిన ఓ పోస్టు సంచలనం సృష్టించింది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ తన పట్ల వేధింపులకు పాల్పడుతున్నారని, హింసిస్తుండడంతో విడాకులు తీసుకుంటున్నానని ఆయన భార్య నీతి దేబ్ పేర్కొంటున్నట్టు ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.

ఏకంగా సీఎం కుటుంబానికి సంబంధించిన వార్త కావడంతో కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బిప్లవ్ దేవ్ భార్య నీతి దేవ్ స్వయంగా స్పందించారు. తన భర్త గురించి కొంత మంది వ్యక్తులు పనిగట్టుకుని మరీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన పుకార్లను పట్టించుకోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొందరు నీచులు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై వెస్ట్ అగర్తలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సీఎం భార్యపై పోస్టు పెట్టిన అనుపమ్ పాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.