ఓటమిని అంగీకరించకపోతే, ట్రంప్ కి బైడెన్ వర్గం వార్నింగ్

| Edited By: Pardhasaradhi Peri

Nov 07, 2020 | 7:34 PM

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోతే వైట్ హౌస్ నుంచి ఎస్కార్టుతో ఆయనను పంపించివేయవలసి ఉంటుందని జో బైడెన్ ప్రచారవర్గం హెచ్చరించింది. తాము జులై 19 నే ఈ విషయాన్ని ప్రకటించామని, ఎన్నికల్లో ఎవరు విజేతలో అమెరికన్లు నిర్ణయిస్తారని బైడెన్ వర్గ ప్రచార సారధి ఎండ్రు బేట్స్ అన్నారు. వైట్ హౌస్ లోకి అక్రమంగా చొరబడినవారిని శ్వేతసౌధం నుంచి పంపివేయడానికి ఈ ప్రభుత్వానికి సామర్థ్యం ఉందన్నారు. కాగా ట్రంప్ గత జులైలో ఫాక్స్ న్యూస్ కి […]

ఓటమిని అంగీకరించకపోతే,  ట్రంప్ కి బైడెన్ వర్గం వార్నింగ్
Follow us on

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోతే వైట్ హౌస్ నుంచి ఎస్కార్టుతో ఆయనను పంపించివేయవలసి ఉంటుందని జో బైడెన్ ప్రచారవర్గం హెచ్చరించింది. తాము జులై 19 నే ఈ విషయాన్ని ప్రకటించామని, ఎన్నికల్లో ఎవరు విజేతలో అమెరికన్లు నిర్ణయిస్తారని బైడెన్ వర్గ ప్రచార సారధి ఎండ్రు బేట్స్ అన్నారు. వైట్ హౌస్ లోకి అక్రమంగా చొరబడినవారిని శ్వేతసౌధం నుంచి పంపివేయడానికి ఈ ప్రభుత్వానికి సామర్థ్యం ఉందన్నారు. కాగా ట్రంప్ గత జులైలో ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ..ఎన్నికల ఫలితాలను అంగీకరించేందుకు, ఒకవేళ తను ఓడిపోతే శాంతియుతంగా అధికారాన్ని అప్పగించేందుకు నిరాకరిస్తానని పేర్కొన్నారు. దీనిపైనే ఎండ్రు  తాజాగా స్పందించారు.