గుంటూరు జిల్లా అద్దంకి – నార్కెట్ పల్లి హైవేపై బోల్తాపడ్డ ట్రావెల్ బస్సు.. 40 మంది ప్రయాణీకులకు గాయాలు
గుంటూరు జిల్లా అద్దంకి - నార్కెట్ పల్లి హైవేపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. రొంపిచర్ల మండలం తంగళ్ళపల్లి మేజర్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది...
గుంటూరు జిల్లా అద్దంకి – నార్కెట్ పల్లి హైవేపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. రొంపిచర్ల మండలం తంగళ్ళపల్లి మేజర్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తున్న ఏపీ 27 టి యు 4664 నెంబరు గల ఈ బస్సులో ప్రమాద సమయంలో 45 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 40 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాధమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.