ఇక డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే జైలుకే…

Traffic Violation Act: భాగ్యనగరంలో ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రూల్స్‌ అతిక్రమిస్తే భారీ జరిమానాలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన కూడా వాహనదారులు పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇకపై ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించాలని భావిస్తున్నారు. వీలయితే జైలు శిక్షతో పాటుగా భారీ జరిమానాలు […]

ఇక డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే జైలుకే...
Follow us

|

Updated on: Feb 10, 2020 | 12:47 PM

Traffic Violation Act: భాగ్యనగరంలో ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రూల్స్‌ అతిక్రమిస్తే భారీ జరిమానాలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన కూడా వాహనదారులు పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఇకపై ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించాలని భావిస్తున్నారు. వీలయితే జైలు శిక్షతో పాటుగా భారీ జరిమానాలు కూడా వేయాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానమైన సీసీ టీవీ కెమెరాల ద్వారా పోలీసులు నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇకపోతే గత నెలలో సుమారు 80 శాతం బైకర్లు మొబైల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండగా.. కారులో వెళ్లే డ్రైవర్లు 40 శాతం మంది నడుపుతూ మాట్లాడుతున్నట్లు గుర్తించారు.

మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న వారిలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. ముంబై ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 39,160 కేసులు నమోదయ్యాయి.

Latest Articles
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!
ఇంట్లో డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ తయారీ చేసుకోండి..
ఇంట్లో డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ తయారీ చేసుకోండి..
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కంపెనీకి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కంపెనీకి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?